రెండు చెట్లకు రూ.50 లక్షలు!
వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటి సుందీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు తరలి వెళ్లాయి. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో నిర్మించే ఇంటి ఆవరణలో ఉంచేందుకు కడియం, వీరవరం రోడ్డులోని గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ చెట్లను రూ.50 లక్షలకు అంబానీ చెందిన కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారు. వీటిని తరలించేందుకు రూ.3.5 లక్షల కిరాయితో ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి స్పెయిన్ నుంచి ఓడలో ప్రత్యేక కంటైనర్లో వీటిని మొక్కలుగా ఉన్నప్పుడు తీసుకువచ్చామన్నారు. తర్వాత ఇక్కడి మట్టి, గోదావరి నీళ్లతో ప్రత్యేక పోషణ చేపట్టి కొత్త రూపురేఖలు తీసుకువచ్చామని తెలిపారు.













