తెలుగు వారిని ఏకం చేసే లక్ష్యంతో ‘అఖిల భారత తెలుగు సేన’ ఆవిర్భావం
దేశంలోని తెలుగు ప్రజలందర్నీ ఏకం చేయాలనే ఉద్దేశ్యంతో ఆలిండియా తెలుగు సేన (అఖిలభారత తెలుగు సేన) సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శ్రీ పి.ఎస్.ఎన్. మూర్తి ఈ సంస్థను స్థాపించారు. దేశంలోని తెలుగు కమ్యూనిటీ మొత్తాన్ని ఏకం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. తెలుగు సంస్కృతి, సామాజిక, ఆధ్యాత్మిక కార్యకలాపాల వ్యాప్తికి ఈ సేన కృషి చేస్తుంది. కాలగర్భంలో కలిసిపోతున్న బుర్రకథ, జానపద నృత్యాలు, జానపద గీతాల వంటి కళలు, కళాకారుల ప్రోత్సాహానికి చర్యలు చేపడుతుంది. హిందూ దేవాలయాలు, హిందూత్వ అభివృద్ధికి పాటుపడుతుంది. యువతకు వారి విద్య, కెరీర్ ఎదుగుతలకు సాయం చేస్తుంది. అకామడేషన్ లేక మరే ఇతర సాయం కావాలన్నా సరే తెలుగు ప్రజలు ఈ సేన సాయం కోరవచ్చు. తెలుగుగ సేన ఒక స్వచ్ఛంద సంస్థ. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలుగు ప్రజలకు ఉచిత సేవలు అందిస్తుంది. తెలుగు కమ్యూనిటీ కోసం ఒక మ్యారేజ్ బ్యూరోను కూడా తెలుగు సేన నిర్వహిస్తోంది. అర్హత కలిగిన యువతీ యువకులు వారి తల్లిదండ్రుల ద్వారా బయోడేటాలను సేనకు పంపవచ్చు. తెలుగు-పాఠశాల ద్వారా తెలుగు కమ్యూనిటీ ప్రజలకు తెలుగు భాషను సేన నేర్పుతుంది. భవిష్యత్తులో ఎక్కడైనా అవసరమైతే రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతుంది. ఈ క్రమంలోనే ఆలిండియా తెలుగు సేన సెంట్రల్ కమిటీ సభ్యులను ప్రకటించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ పి.ఎస్.ఎన్. మూర్తి-వ్యవప్థాపకులు మరియు అధ్యక్షులు, శ్రీమతి భవానీ సాధు-ఉపాధ్యక్షురాలు, రవి రామచంద్ర భవానీ-ఉపాధ్యక్షులు, అడ్వకేట్ బాలజ్యోతి-సెక్రటరీ, చామర్తి నాగేశ్వర రావు-జాయింట్ సెక్రటరీ, జయంతి వెంకట రావు-ట్రెజరర్. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా, పి.ఉషాదేవి, పి. రాజా రమేష్, బి. రామకృష్ణ, శిష్ట అనంత్, ఎన్. మాధవీలత, ఎమ్. నాగేశ్వర రావు, యు. రామ్ ప్రసాద్, ప్రవీన్ కిలారి, కె.ఎస్.ఎన్. మూర్తి, జయంతి పద్మ, సూరిబాబు కిలారి, రాజేష్ రావు, పి.ఎస్. మూర్తి, గుత్తా రఘునాథ్, వకలపూడి శివ కృష్ణ ఎన్నికయ్యారు.
అఖిలభారత తెలుగు సేన రాష్ట్ర అధ్యక్షులుగా 14 మందిని ఎంపిక చేశారు. వీరంతా ఆయా రాష్ట్రాల్లో సేనకు సంబంధించిన కార్యకలాపాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్-ఎమ్. ఉదయ్ భాస్కర్, చత్తీస్‌గఢ్-ఆర్. మురళి, గుజరాత్-కొల్లూరు ఎన్. మూర్తి, జార్ఖండ్- ఏటి ధర్మారావు, కర్ణాటక-అయ్యగారి సుబ్రమణ్యం, మధ్యప్రదేశ్-అడ్వకేట్ ఎస్. ప్రభాకర్ రావు, మహరాష్ట్ర-సి.వి.ఎల్. ఫణి, ఒడిషా-ఇ.ఎన్. మూర్తి, తెలంగాణ-డి.వి. సాయి సుబ్రమణ్యం, ఢిల్లీ-జి.వి.ఆర్. మురళి, పాండిచ్చేరి యుటి-తమ్మన మనోజ్ గుప్తా, పశ్చిమ బెంగాల్-రాయపరెడ్డి కిషోర్, తమిళనాడు-ఆర్. శంకరన్, కేరళ-హరి హర నాయుడు. మిగతా రాష్ట్రలకు సంబంధించిన అధ్యక్షులను కూడా త్వరలోనే ఎన్నకుంటామని సేన ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులకు సేన వ్యవస్థాపకులు, అధ్యక్షులు పి.ఎస్.ఎన్. మూర్తి అభినందనలు తెలిపారు.
వీరితోపాటు విదేశాల్లో తెలుగు సేన అధ్యక్షులుగా కెనడాకు చెందిన స్వామి నారాయణ్, లీగల్ ప్లాట్‌ఫామ్ అధ్యక్షులుగా కె.ఎస్. లక్ష్మి, ఆలిండియా తెలుగు కళాకారుల సంఘం అధ్యక్షులుగా పిలుట్ల లక్ష్మీకాంత శర్మ, ఆలిండియా ప్రీస్ట్(పూజారుల సంఘం) ప్రెసిడెంట్‌గా నందనూరి వరదా విష్ణుమాచార్యులు, ఆలిండియా తెలుగు బిజినెస్మెన్ సేన ప్రెసిడెంట్‌గా రాజేష్ మనం, ఆలిండియా తెలుగుసేన సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా జి.సత్యనారాయణ, ఆలిండియి వుమెన్ ఎన్‌లైట్‌మెంట్ వైస్ చైర్‌పర్సన్‌గా పేరి ఉషాదేవి ఉన్నారు.













