ప్రపంచంలోనే అతిపెద్ద తాళం… రామ మందిరానికి
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి. అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ.2 లక్షల ఖరీదు చేసే ఈ తాళం పై రాముడు చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పోడవు 400 కిలోల బరువు ఉంటే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఈ లాక్‌ని క్షేత్ర స్థాయిలో పూర్తిచేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించారు.
అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని తెలిపారు. అంతేకాదు సత్యప్రకాశ్ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.













