రక్షణ శాఖ సంచలన నిర్ణయం… ఆర్మీలో
భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 జూలై నాటికి అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని 45 వేల మంది యువతను రక్షణ దళంలోకి తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. ఆర్మీలో యువతను నింపాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.













