కాంగ్రెస్ ను పక్కనపెట్టి, కీలక సమావేశం నిర్వహించనున్న పవార్
రెండు వారాలు తిరక్క ముందే వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మళ్లీ కలుసుకున్నారు. దాదాపు 3 పాటు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీ ఢిల్లీ వేదికగా జరిగింది. థర్డ్ ఫ్రంట్ నెలకొల్పుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇది సాధారణ భేటీయే అని, రాజకీయాలు చర్చకే రాలేదని పీకే సమాధానమిచ్చారు. ఈ భేటీతో మిషన్ 2024 కు రూపకల్పన ప్రారంభమైందని ఎన్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వీరిద్దరి భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత పవార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ యేతర పక్షాలతో ఓ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మంగళవారం ఈ సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ మినహా అన్ని పక్షాల వారికి పవార్ ఆహ్వానం పంపారు. పవార్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కూడా ఇందులో పాలు పంచుకోబోతున్నారు. 15 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు.













