ప్రజలకే సీఎం అభ్యర్థి ఎంపిక ఛాన్స్.. 17వ తేదీ సాయంత్రంలోపు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజాభిప్రాయం మేరకే ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు పంజాబ్ ప్రజలు తమ ఎంపికను తెలియజేడానికి కాల్, మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు. పంజాబ్‌లోని 3 కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నాము. జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజలు ఓటు ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని అన్నారు.
పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌మాన్‌ను ఎంపిక చేస్తారని వస్తున్న ఊహాగానలపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. భగవంత్ మాన్ నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. తలుపులు మూసి నాలుగు గోడల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవద్దని ఆయనే నాకు సూచించారు. సీఎం ఎంపిక కోసం ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనే అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.













