50 ఏళ్ల క్రితం చోరికీ గురైన విగ్రహాలు.. అమెరికాలో గుర్తింపు
తమిళనాడులో 50 ఏళ్ల క్రితం చోరికి గురైన పురాతన విగ్రహాలు అమెరికా మ్యూజియంలో ఉన్నట్లు గుర్తించారు. తిరువారూరు జిల్లా మన్నార్గుడి సమీపం ఆలత్తూర్లోని వేణు గోపాలస్వామి ఆలయంలో వినాయగర్, యోగ నరసింహర్ విగ్రహాలను 50 ఏళ్ల క్రితం దొంగిలించారు. వాటి స్థానంలో నకిలీవి ఉంచారు. 2017లో దీనిని గుర్తించిన దేవాదాయశాఖ అధికారులు విగ్రహాల ఆక్రమ రవాణా నిరోదక విభాగానికి ఫిర్యాదు చేశారు. అమెరికాలోని మ్యూజియంలో ఈ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.













