25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ కోవిడ్ పరీక్ష చేపట్టారు. అయితే కరోనా పరీక్షలో సుమారు 25 మందికిపైగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. సమావేశాలకు హాజరవుతున్న సభ్యులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆ పరీక్షల్లో ఉభయసభలకు చెందిన 25 మంది ఎంపీలకు పైగా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిలో 17 మంది లోక్సభ సభ్యులు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన లోక్సభ సభ్యుల్లో వారిలో అధికార బీజేపీకి చెందిన వారు 12 మంది సభ్యులు కాగా, వైకాపాకు చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ చొప్పున ఉన్నారు.













