జెలెన్స్కీ కీలక నిర్ణయం..ఆ నాలుగు దేశాల నుంచి
ఉక్రెయిన్, రష్యా సంక్షోభంలో భారత్ తటస్ఠ వైఖరి అవలంభిస్తున్న సంగతి విదితమే. రష్యా తీరును ఖండించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలను అప్పట్లోనే కోరారు. కానీ భారత్ ఎటు వైపు మొగ్గలేదు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలకు భరత్ సూచించింది. అంతే కాదు ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగా ఉండిపోయింది. మరి ఈ కారణమో, ఇంకే కారణమో తెలియదు కానీ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించారు. భారత్ నుంచే కాదు, నార్వే, చెక్ రిపబ్లికన్, జర్మనీ, హంగేరీ దేశాల నుంచి కూడా తమ రాయబారులను వెనక్కి పిలిపించారు. ఈ మేరకు అధ్యక్షుడి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే ఆయా దేశాల్లో రాయబారులను ఎందుకు తొలగించారన్నది మాత్ర వెల్లడిరచలేదు. అయితే వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అనే విషయం తెలియవలసి ఉంది.













