మాకు మరిన్ని ఆయుధాలు కావాలి: జెలెన్స్కీ
రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నామయని తెలిపారు. ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుందని అని జెలెన్స్కీ తెలిపారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ మనం అలా జరగనివ్వరాదు అని చెప్పారు.













