ఆహ్వానం అందినా రాలేకపోతున్న.. జెలెన్స్కీ
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా, దానికి మద్దతిస్తున్న బెలారస్, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ దేశాలకు రాణి అంత్యక్రియలకు బ్రిటన్ ఆహ్వానం పంపలేదు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ హాజరుకాబోవడం లేదు. బ్రిటన్‌తో అతి తక్కువ సబంధాలు గల ఇరాన్ నుంచి దౌత్యస్తాయి అధికారి పాల్గొననున్నారు. అమెరికా అద్యక్షుడు జో బైడెన్ సహా న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధానులతో పాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోస, జర్మనీ అధ్యక్షుడు స్టెయిన్‌మెయిర్, బెల్జియం ఉంచి కింగ్ ఫిలిప్, క్వీన్ మథిల్డే, స్వీడన్ నుంచి కింగ్ కార్ల్`16 గస్తఫ్, క్వీన్ సిల్వియా, నెదర్లాండ్స్ నుంచి కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా, స్పెయిన్ నుంచి కింగ్ ఫిలిప్, క్వీన్ లెటిజియాలు హాజరవుతారని భావిస్తున్నారు.













