ఎవరు గెలుస్తారో తేలిపోయింది .. అయినా కానీ
ఉక్రెయిన్ స్వాతంత్య్రం కోసం మద్దతుగా నిలిచిన వారికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. కానీ సమయం మించిపోయింది. ఎవరు గెలుస్తారో తేలిపోయింది. అయినా కానీ యుద్ధం కన్నీళ్లు ఇంకా నిలిచే ఉన్నాయి. మనందరి ఉమ్మడి పోరాటం స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం, జీవించే హక్కుకోసం అని పేర్కొన్నారు. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలను జెలెన్ స్కీ ప్రస్తావించారు. మూడో ప్రపంచ యుద్దానికి అవకాశం లేదన్నారు. తమ భూభాగంలో రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని ప్రకటించారు. యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచిన నాడు ప్రపంచంలోనే స్వేచ్చాకాముక ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.













