వయసు మళ్లిన వారితో పోలిస్తే.. యువతకే ఎక్కువ!
మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట. మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణులు వెల్లడించారు. 15-39 ఏళ్ల వారిలో ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి రిస్క్ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్కుల్యలర్ జబ్బులు, గుండె పోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది. ఒకటి నుంచి రెండు పెగ్గులకే పరిమితం అయితే మంచిదని పరిశోధకులు సూచించారు. 15`39 ఏళ్ల పురుషులు ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్య పరంగా నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెబుతున్నారు.













