అమెరికాకు జిన్ పింగ్ పరోక్ష హెచ్చరిక
తైవాన్‌కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గట్టి హెచ్చరిక చేశారు. చైనా నుంచి తైవాన్ను విడదీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్ 130 వ జయంతిని పురస్కరించుకుని బీజింగ్‌లోని టియానన్మెన్స్వేర్లో మావో సమాధి వద్ద నివాళి అర్పించారు. జెడాంగ్ విజయాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం జరిగిన పొలిట్‌బ్యూరో కార్యక్రమంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ మాతృభూమి నుంచి తైవాన్ను ఎవరూ వేరు చేయలేరని, బీజింగ్ కృతనిశ్చయంతో ఇలాంటి చర్యల్ని నిరోధిస్తుందని అన్నారు. మాతృభూమి తప్పనిసరిగా పునరేకీరించబడాలని నొక్కి చెప్పారు. అమెరికా సైనిక నాయకుల బహిరంగ అంచనాలను ప్రస్తావిస్తూ, వారి ప్రణాళికలు అమలు కాబోవని అన్నారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికలకు ముందు జిన్‌పింగ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.













