ట్రంప్ తో ఆ 90 సెకన్లు నా జీవితంలోనే చెత్త టైం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ దేశ పోర్న్ స్టార్ స్టోర్మీ డానియల్ ఆరోపించారు. తన భార్య మెలానియా వెనుక తనతో ట్రంప్ సెక్స్ జరిపిన 90 సెకన్లు తన జీవింతోనే చెత్త టైం అని పేర్కొన్నారు. స్టోర్మీ డానియల్‌ను ట్రంప్ మాజీ అటార్నీ మిచైల్ కొహెన్ ఇంటర్వ్యూ చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో తమ అనుభవాలను డానియల్, మిహైల్ కొచెన్ వెల్లడించారు. డానియల్ 2006 సెక్స్ ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేసుకున్నారు. సదరు ఎపిసోడ్ తనను తాను ద్వేషించేలా చేసిందన్నారు. నాడు ట్రంప్ ఒక హోటల్లో తన కోసం నగ్నంగా వేచి చూస్తున్నారని ఆరోపించారు. తనతో దారుణంగా ప్రవర్తించాడని మండిపడ్డారు.
ట్రంప్‌కు తనతో లైంగిక సంబంధాల విషయమై మాట్లాడకుండా ఉండేందుకు 2016 దేశాధ్యక్ష ఎన్నికల సమయంలో స్టోర్మి డానియల్‌కు 1.30 లక్షల డాలర్లు చెల్లించినట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించినట్లు సమాచారం. నాటి ఘటనలను డానియల్, మిచైల్ కోహెన్ గుర్తు చేసుకున్నారు. డానియల్‌కు కొహెన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. మెలానియా తన కొడుకు బారోన్కు జన్మనిచ్చిన నెలల సమయంలోనే డానియల్‌తో సెక్స్ చేసినట్లు ట్రంప్ స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ విషయమై ట్రంప్ భార్య మెలానియా బాధపడినట్లు పుకార్లు షికారు చేశాయి.













