ప్రపంచంలోనే అతి పొడగరి.. ఐదు రికార్డులు
ప్రపంచంలోనే అతి పొడగరి మహిళగా గిన్నీస్ రికార్డు దక్కించుకున్న రుమేయసా గెల్గీ అనుబంధంగా మూడు రికార్డులు సాధించారు. మొత్తం మీద ఈ టర్కీ టాలర్ మహిళ ఐదు ప్రపంచ స్థాయి ఘనతలతో విశ్వఖ్యాతి దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు నిర్ధారణల తరువాత ఆమె ఈ ఐదు రికార్డులు స్థాపించినట్లు గిన్నీస్ రికార్డులు ఒ ప్రకటనలో తెలిపింది. ఓ మహిళలకు అతి పొడవైన చేతివేలు ఉండటం ఇది. 11.2 సెంటిమీటర్ల వరకూ ఉంది. పొడవాటి చేతులు, వీటిలో కుడిచేయి 24 సెంటిమీటర్లు, ఎడమ చేయి దాదాపు 25 సెంటిమీటర్లు ఉంది. వెన్ను అతి పొడవుగా దాదాపు 60 సెంటిమీటర్ల వరకూ ఉంది. 1997 జనవరి 1వ తేదీన జన్మించిన రుమేయసా లాయర్, పరిశోధకురాలు, పైగా గత ఏడాది నుంచి అతి పొడుగ్గా ఉన్న మహిళల స్థాయిలో రికార్డును దక్కించుకుంటూ వస్తున్నారు.













