ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టులో.. భారత్ కు స్ధానం
భారత పౌరులకు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇందులో కొన్ని దేశాలు ముందుగానే వీసా ఇస్తుంటే మరికొన్ని అక్కడికి చేరుకున్నాక వీసాలిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల్లో భారత్ పాస్‌పోర్టుకు 87వ ర్యాంకు దక్కింది. హెన్లే అండ్ పార్ట్నర్స్ అనే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ 2022కు ఈ ర్యాంకులు విడుదల చేసింది. కాగా, ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా ఐదో సారి ప్రథమ స్థానం సాధించింది. జపాన్ పాస్‌పోర్టు ఉన్నవారు 193 దేశాలకు సులువుగా వెళ్లవచ్చు.
సింగపూర్, దక్షిణ కొరియా పాస్‌పోర్టులు ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాయి. జర్మనీ, స్పెయిన్ పాస్‌పోర్టులు ఉమ్మడిగా మూడో ర్యాంకు సాధించాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా పాస్‌పోర్టులు వరుసగా ఆరు, ఏడు ర్యాంకులు సాధించాయి. యూఏఈ పాస్‌పోర్టు 15వ స్థానంలో ఉండగా, 80 దేశాలకు సులువైన ప్రవేశం ఉన్న చైనా పాస్‌పోర్టు 69వ ర్యాంకు పొందింది. రష్యా పాస్‌పోర్టు 50వ ర్యాంకు దక్కింది.













