ఈ పెయింటింగ్ .. ధర 450 కోట్లు
బ్రిటన్‌కు చెందిన చిత్రకారుడు సాషా జాఫ్రి ది జర్నీ ఆఫ్ హ్యుమానిటీ పేరుతో గతేడాది మార్చి చివరి వారంలో దుబాయ్‌లోని అట్లాంటిస్ ది పామ్ హోటల్ లో భారీ కాన్వాస్ పెయింటింగ్ వేయడం మొదలు పెట్టాడు. ఏడు నెలలపాటు రోజుకు 20 గంటలు కష్టపడి పెయింటింగ్‌ను పూర్తి చేశారు. ఆ పెయింటింగ్‌కు గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కింది. భారీ పెయింటింగ్‌ను 70 ప్రేములుగా విభజించి వేలంలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ప్రేమ్స్ ను అమ్మితే కనీసం 32 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.217 కోట్లు) రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చిన్నారుల కోసం పెయింటింగ్ విక్రయిస్తున్నారని తెలిసి దుబాయ్‌కి చెందిన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దూన్ ఆ ఫ్రేమ్స్ అన్నింటిని ఒక్కడే కొనుగోలు చేశాడు. 62 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.450 కోట్లు) చెల్లించాడు. జాఫ్రి వేసిన పెయింటింగ్ ఎంతో బాగుందని, వాటిని వేరు చేయడం ఇష్టం లేకనే అన్నింటిని తానే కొంటున్నట్లు తెలిపాడు. అలాగే, పేదకుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలి గురించి బాగా తెలుసని, పేదరికంలో మగ్గుతున్న చిన్నారులకు ఈ విధంగా సాయం చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. పెయింటింగ్ విక్రయించగా వచ్చిన డబ్బును చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయనున్నట్లు జాఫ్రి వేలం నిర్వాహకులు తెలిపారు.
అయితే దీనిని గీసేందుకు అతడికి 1065 పెయింటింగ్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింటింగ్ పట్టిందట. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నిస్‌బుక్ నిర్వాహక అధికారులు ధృవీకరించారు. అంతేగాక రికార్డుకు సంబంధించిన పత్రాన్ని ఆర్టిస్ట్ జాఫ్రీకి నిర్వాహకులు అందిచారు.













