యూకేలో వారంలో నాలుగు రోజులే
ఆదివారం రోజు సెలవు అన్న భావన నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎప్పుడో దూరం అయ్యాయి. ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తున్నాయి. ఇప్పుడు వారానికి మూడు రోజుల సెలువు ఉంటే ఎలా ఉంటుంది అన్న దానిపై యూకేలో అధ్యయనం మొదలైంది. ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. యూకేలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 70 సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగంగా తమ ఉద్యోగులకు వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నారు. ఆరు నెలల పాటు ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. అదనపు సెలవు వల్ల ఉద్యోగుల పనితీరులో నాణ్యత, సంస్థల ఉత్పాదకత తదితర అంశాలపై ఆక్స్ఫర్డ్, కేంబ్రడ్జి వర్సిటీలు, అమెరికాలోని బోస్టన్ కాలేజీ సంయుక్తంగా అధ్యయనం చేస్తాయి.













