శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితా ఇదే
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 83వ వ స్థానంలో ఉండగా, ఈ సారి రెండు స్థానాలు దిగజారింది. భారత్ పాస్పోర్టుతో 59 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. గతంలో 60 దేశాల్లో పర్యటించేందుకు వీలుండగా ఇటీవలే సెర్బియా ఆ నిబంధనను తొలగించింది. మొత్తం 199 దేశాలతో హెన్లీ సంస్థ ఈ జాబితాను ప్రకటించింది. ఇందులో జపాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్, దక్షిణకొరియా సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, జర్మని, స్పెయిన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.













