ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ధ్వంసం
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ఏఎన్-225 మ్రియాను రష్యాదళాలు ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ భాషలో మ్రియా అంటే కల. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ దీనిని తయారు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం గుర్తింపు పొందిన ఈ విమానం రాజధాని కీవ్ సమీపంలోని హోస్టామెల్ ఎయిర్పోర్టుపై రష్యా జరిపిన దాడిలో ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. మ్రియాను ధ్వంసం చేయడంపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. దీనిని తాము పునర్నిస్తామని స్పష్టం చేసింది. బలమైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని పేర్కొంది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించలేదని పేర్కొంటూ విమానం ఫొటోను షేర్ చేసింది.













