జనవరి 1 నాటికి 800 కోట్లు దాటేస్తాం!
ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. కొత్త ఏడాది ఆరంభానికల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కుని దాటేస్తుందని అమెరికా జనగణన బ్యూరో వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర పెరిగిందని, జనవరి 1 నాటికి ఇది 800 కోట్ల మార్కుని అధిగమిస్తుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధిరేటు కేవలం 1 శాతం లోపే ఉందని తెలిపింది. 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది.













