పెరిగిన ప్రపంచ జనాభా.. ఎంతో తెలుసా?
నూతన సంవత్సర దినోత్సమైన జనవరి 1, 2022 నాటికి ప్రపంచ జనాభా 7.8 బిలియన్లు (780 కోట్లు)గా ఉంటుందని అమెరికా జనగణన విభాగం వెల్లడిరచింది. ఏడాది కాలంలో 74 మిలియన్లు (7.4 కోట్లు) మేర పెరిగింది. జనాభా పెరుగుదల 0.9 శాతం గా నమోదయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 మంది జన్మిస్తున్నట్టు, ఇద్దరు మరణిస్తున్నట్టు తెలిపింది. అమెరికాలో ఏడాది కాలంలో 7.07 లక్షల మేర జనాభా పెరిగింది. ఇక్కడ ప్రతి తొమ్మిది సెకన్లకు ఒకరు జన్మిస్తున్నట్టు, 11 సెకన్లకు ఒకరు మరణిస్తున్నట్టు తెలిపింది. 130 సెకన్లకు విదేశాల నుంచి ఒకరు వలస వస్తున్నట్టు అంచనా వేసింది.













