జనాబా పెరుగుదల రేటు తగ్గుతోంది : అమెరికా
ఈ ఏడాది సెప్టెంబరు 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని అమెరికా జనగణన సంస్థ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి అయితే ప్రపంచ జనసంఖ్య 2022 నవంబరు 22 నాడే 800 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. 1960`2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరవాత నుంచి తగ్గుముఖం పడుతోందని తెలిపింది. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. ప్రస్తుతం మూడు వంతుల ప్రపంచ జనాభా 2.1, అంతకు తక్కువ భర్తీ రేటు ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు. 2.1కి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నారు. 2.1 కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, స్వీడన్లు ఉండగా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్లలో అంతకన్నా తక్కువ భర్తీ రేటు కనిపిస్తోంది.













