భారత సంతతి మహిళకు.. ప్రతిష్ఠాత్మకమైన

భారత సంతతికి చెందిన పోషకాహార నిపుణులు శకుంతల హరక్ సింగ్ తిల్‍స్టెడ్ ఈ ఏడాదికిగాను ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్‍కు ఎంపికయ్యారు. అవార్డు కింద 250000 డాలర్ల నగదు ప్రదానం చేస్తారు. ఆహార, వ్యవసాయ రంగంలో దీనిని నోబెల్ బహుమతితో సమానంగా పరిగణిస్తారు. మత్స్యరంగంలో శకుంత అందించిన సేవలకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఆమె స్వస్థలం ట్రినిటాడ్ అండ్ టొబాగో. ఆమెకు డెన్మార్క్ పౌరసత్వం ఉన్నది. ఆమె పూర్వీకులు ట్రినిటాడ్‍కు వలసవెళ్లారు.