వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యం
కొవిడ్ కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు.. వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచే పని) వెసులుబాటు ఇచ్చాయి. అనేక రంగాల్లో ఉద్యోగాల్లో క్షీణత కనిపించినా..టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి ఆ ప్రభావం కొంత మేర తక్కువగానే ఉంది. గత కొన్ని నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న (రిమోట్ వర్కింగ్) వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ తాజా నివేదిక పేర్కొంది. అలాగే కొవిడ్ 19 ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్హోం ఉద్యోగ నియామకాలు మూడు రేట్లు పెరిగినట్లు వెల్లడించింది. గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోంచేసే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం గణనీయంగా వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7 రేట్లు పెరిగినట్లు సదరు సర్వే పేర్కొంది. ఇది కొవిడ్ 19 కంటే ముందుతో పోలిస్తే 3శాతం ఎక్కువని వెల్లడించింది.
గత ఐదు నెలలుగా రిమోట్ వర్కింగ్ (ఎక్కడి నుంచైనా పనిచేసే) ఉద్యోగాల గురించే ప్రధానంగా తమ సెర్చ్ ఇంజన్ లో వెతికినట్లు నౌకరీ డాట్ కామ్ సర్వే పేర్కొంది.













