అమెరికాలో ఈ ఘటన.. 5 గంటల పాటు బాత్ రూంలోనే!
విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె చాలా భయపడిపోయింది. మిగతా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఆ మహిళ విమానం టాయిలెట్లో ఐసొలేట్ అయ్యింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది. మిచిగాన్కు చెందిన టీచర్ ఫోటీయో, డిసెంబర్ 19న తన కుటుంబ సభ్యులతో కలిసి చికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానంలో ప్రయాణించారు. విమానం ఆకాశంలో ఉండగా గొంతులో మంటతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీంతో విమానంలోని బాత్రూమ్కు వెళ్లారు. తన వద్ద ఉన్న కిట్‌తో కరోనా టెస్ట్చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె చాలా ఆందోళన చెందారు. భయంతో అక్కడే ఏడ్చారు. ఫ్లైట్ అటెండెంట్ రాకీ, వెంటనే ఫోటీయా వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకుని ఆమెను సముదాయించారు. విమానంలో సీట్లు ఖాళీగా లేవు. ఫ్లైట్ అటెండెంట్ రాఖీ ఈ విషయాన్ని ఫోటీయోకు తెలిపారు. మిగతా ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని టాయిలెట్లోనే ఆమె ఐసోలేట్ అయ్యారు.













