రష్యా కుట్రను భగ్నం చేసిన ఉక్రెయిన్!
తమ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్యకు రష్యా చేసిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న ఉక్రెయిన్ మహిళను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది. జెలెన్స్కీ మికోలైవ్ ప్రాంత పర్యటన సందర్భంగా ఈ హత్యకు పథక రచన జరిగిందని తెలిపింది. మికోలైవ్ చెందిన మహిళ రష్యాకు రహస్యంగా చేరవేసిందని, ఆ సమాచారంలో వైమానిక దాడి చేయాలని మాస్కో ప్రయత్నించిందని ఆరోపించింది. జులై చివరి వారంలో జెలెన్స్కీ ఇక్కడి మికోలైవ్ రీజియన్‌ను సందర్శించారు. ముందుగానే నిర్ణయించిన ఈ పర్యటనకు సంబంధించిన రహస్య వివరాలను ఓ మహిళా ఇన్ఫార్మర్ నుంచి సేకరించారు. దేశాధినేత రూట్ మ్యాప్‌లోని ప్రాంతాలు, సమయం తదితర వివరాలలో జాబితాను రూపొందించేందుకు యత్నించారు. అయితే, మా ఏజెంట్లకు ఈ విషయమై సమాచారం అందింది. దీంతో వారు అదనపు భద్రతా చర్యలు చేపట్టారు అని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడిరచింది. ఆ మహిళలను మికోలైవ్లోని ఓచకోవ్ నివాసిగా గుర్తించారు.













