చైనాకు సాయం వద్దు : నిక్కీ హెలీ
అమెరికా అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హెలీ మరోసారి చైనాపై మండిపడ్డారు. కోవిడ్ 19 వైరస్ బీజింగ్ ల్యాబ్ నుంచే వచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని అమెరికా నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ 19 వైరస్ బహుశా చైనా ల్యాబ్ నుంచే వచ్చింది. అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలి. కమ్యూనిస్ట్ దేశమైనా చైనాకు ఒక్క సెంట్ కూడా ఇవ్వొద్దు అని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ హెలీ నిలిచింది. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఇప్పటికే ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటీకి విదేశీ నిధులను నిలిపివేస్తానని ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టారు. అమెరికా ప్రజలు ఎంతో కష్టపడి కూడగట్టిన సంపదను అలాంటి వారికి ఎందుకు ధారపోయాలని ఆమె ప్రశ్నించారు.













