అప్పుడే కఠిన ఆంక్షలు అవసరం లేదు… ప్రపంచ దేశాలకు
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి, వైరస్ కట్టడిలో భాగంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించగా మరికొన్ని దేశాలు కొవిడ్ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై అతిగా స్పందించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రపంచ దేశాలకు సూచించారు. కఠానాంక్షలు అవసరం లేదన్నారు. తమ ప్రజలను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని మేం అర్థం చేసుకున్నాం. కానీ ఒమిక్రాన్ వేరియంట్ పై మాకింకా పూర్తి అవగాహన రాలేదు. వేరియంట్ తీవ్రత ఎంత? ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదురోగలవా? అనే ప్రశ్నలకు సమాధానం అన్వేషించాల్సి ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదు. అయినా అప్పుడే కొన్ని దేశాలు వైరస్ కట్టడికి అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తూన్నాయి. వీటివల్ల వైరస్‌ను నియంత్రించలేం. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. పరిస్థితులు మరింత దిగజారుతాయి అని అన్నారు.













