గ్రీన్ కార్డు కోటా కు అమెరికా టాటా .. ప్రవాస భారతీయులు ఊరట
ప్రవాస భారతీయ అమెరికన్లకు అతి పెద్ద ఊరట. ఇప్పటివరకు దేశానికి ఇంత అని ఉన్న నిర్దేశిత గ్రీన్ కార్డు కోటాను ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రతిపాదించిన బిల్లు ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ (ఈగల్) చట్టం 2022 ఈ వారం అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. దీనిపై ఓటింగూ జరగనుంది. ఈగల్ బిల్లుకు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కూడా మద్దతు ప్రకటిచింది. ఈ నేపథ్యంలో ఆమోదానికి అడ్డంకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాలోని కంపెనీలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగుల ఎంపికకు ప్రాధాన్యం ఇస్తాయి. తద్వారా సహజంగానే వేలాదిమంది ప్రవాస భారతీయులకు మేలు చేకూరనుంది. రెండేళ్లుగా ఇమ్మిగ్రెంట్ వీసా బ్యాక్‌లాగ్‌లో ఉన్నవారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించడం సహా పలు ప్రయోజనాలు ఈగల్ బిల్లులో ఉన్నాయి.













