జులై నుంచి వీసా.. అపాయింట్‍మెంట్లు

భారత్‍లో జూలై నుంచి వీసా అపాయింట్‍మెంట్లు సంఖ్యను పెంచనున్నట్టు న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం అధికారి డాన్ హెఫ్లిన్ చెప్పారు. వీసా పక్రియ కొంచెం ఆలస్యమైనా అమెరికాలోని విద్యాసంస్థలు అనుమతిస్తాయని, దీనిపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆగస్టు 25లోగా అమెరికాకు చేరుకోవడానికి ప్రయత్నించాలని, ఒక వళ ఇది సాధ్యం కాకపోతే సంబంధిత విద్యా సంస్థలను సంప్రదించాలని సూచించారు.