వినియోగదారుల కోసం …. వాట్సాప్ సరికొత్త ఫీచర్
వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. విండోస్ బీటాలో కాల్స్ నోటిఫికేషన్‌ను డిసేబుల్ చేసే అవకాశాన్ని కల్పించింది. బీటా యూజర్లు ఇందుకోసం మైక్రో సాఫ్ట్ స్టోర్‌లోని విండోస్ 2.2250.4.0 వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే కాల్స్ నోటిఫికేషన్ డిసెబుల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా కాల్ అలర్ట్స్‌ను టర్న్ ఆఫ్ చేయొచ్చు. ప్రస్తుతం మనకు డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టినా వాట్సాప్ కాల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇవి చిరాకు తెప్పిస్తుంటాయి వాట్సాప్ తెచ్చిన సరికొత్త ఫీచర్‌తో ఇక మ్యానువల్‌గా ఈ నోటిఫికేషన్స్‌ను డిసెబుల్ చేయొచ్చు.













