విమర్శలపై క్లారిటీ ఇచ్చిన వాట్సప్ …
తమ సమాచారాన్ని ఫేస్బుక్ వాడుకుంటుందంటూ ఇటీవల వాట్సాప్ అప్డేట్ నిబంధనలపై వెల్లువెత్తిన విమర్శలపై వాట్సప్ సృష్టతనిచ్చింది. తాజా మార్పులు స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపిన సమాచార గోప్యతను ఏవిధంగానూ ప్రభావితం చేయవని పేర్కొంది. పుకార్లను తక్షణమే పరిష్కరించాలని వాట్సప్ కోరుకుంటుందని తెలిపింది. ఇది మీ వ్యక్తిగత సందేశాలకు భద్రత కల్పిస్తుందని పునరుద్ఘాటించింది. మీ వ్యక్తిగత సందేశాలను చూడలేమని, మీ కాల్స్‌ను వినలేమని సృష్టం చేసింది. వాట్సప్ మాతృసంస్థ ఫేస్బుక్ తమ వినియోగదారుల సందేశాలను లేదా కాల్స్‌ను కూడా చదవలేదని పునరుద్ఘాటించింది. గతవారం జరిగిన వాట్సప్ అప్డేట్ నిబంధనలపై ప్రజల విమర్శలతో మరో కొత్త అప్డేట్ను ప్రకటిస్తూ.. కొత్త అప్డేట్ ఫిబ్రవరి 8 నుండి వర్తిస్తుందని తెలిపింది.
ప్రైవేట్ పాలసీ అప్డేట్పై వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తూ.. వాట్సప్ తన సైట్లో మరో ఎఫ్ఎక్యూ పేజీని విడుదల చేసింది. ఇది యాప్‌లో వ్యక్తిగత సమాచార మార్పిడిని ప్రత్యేకంగా హైలెట్ చేస్తుందని తెలిపింది. వాట్సప్‌లో మీ కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మాట్లాడినా సందేశాలను పంపినా.. ఫేస్బుక్ గాని, వాట్సాప్ గాని సందేశాలను వినదు, చదవదని తెలిపింది. మీరు పంపిన సమచారం ఏదైనా ఇద్దరి మధ్యే ఉంటుందని వాట్సప్ తెలిపింది. ప్రైవేట్ పాలసీ అప్డేట్తో సమాచారానికి ఎటువంటి సమస్య లేదని సృష్టం చేసింది. వాట్సప్ ప్రతి ఒక్కరి మెసేజ్‌లను, కాల్ చేస్తున్న వారివి నమోదు చేస్తుంది. మీరు పంపిన లోకేషన్‌ను వాట్సప్గాని ఫేస్బుక్ గాని చూడలేదు. వాట్సాప్ తన వినియోగదారులను ఫేస్‌బుక్‌కు పంపదు. వాట్సాప్ గ్రూపులు ప్రైవేట్‌గానే ఉన్నాయి. మీరు మీ సందేశాలను అదృశ్యమయ్యేలా చేయవచ్చు. మీరు మీ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.













