రష్యాలోనే ప్రిగోజిన్ : లుకషెంకో
రష్యాలో తిరుగుబాటు ప్రయత్నం చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం ఎక్కడున్నారనే దానిపై వినిపిస్తున్న ఊహాగానాలకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తెరదించారు. ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఉన్నారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. వాగ్నర్ సేనలు తిరుగుబాటు ప్రయత్నానికి ముందు కొనసాగిన ప్రాంతాల్లోని శిబిరాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ శిబిరాలు నిర్దిష్టంగా ఎక్కడున్నాయో మాత్రం చెప్పలేదు. గత నెలలో లుకషెంకో మధ్యవర్తిత్వం వల్లే వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. అప్పట్లో ప్రిగోజిన్ బెలారస్లో ఉన్నారని లుకషెంకో తెలియజేయడం గమనార్హం.













