హెచ్ 1బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్‌న్యూస్. గత ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వేతన నిబంధనల అమలును జో బైడెన్ ప్రభుత్వం మే 14కు వాయిదా వేసింది. నిజానికి ఈ కొత్త రూల్స్ మార్చి 15నే అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పుడు దీనిని వాయిదా వేయడం వల్ల రానున్న హెచ్-1బీ ఫైలింగ్ సీజన్‌కు ఇవి వర్తించవు. కొత్త రూల్స్ ప్రకారం హెచ్ 1బీ, హెచ్1-బీ1 వీసాలపై పనిచేసే విదేశీ వర్కర్లకు స్థానిక ఉద్యోగులను చెల్లించే వేతనంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ జీతానికి పనిచేసే విదేశీ వర్కర్ల కోసం స్థానికులను అమెరికా కంపెనీలు విస్మరించకుండా ఉండేందుకు గత ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త వేతన నిబంధనలు తీసుకొచ్చింది.













