ఉక్రెయిన్ అధ్యక్షుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌ను ఓ ఫ్యాసింజర్ కారు ఢీకొట్టడంతో జెలెన్స్కీ స్వల్పంగా గాయపడ్డారు. వైద్య బృందం అధ్యక్షుడికి చికిత్స అందించింది. జెలెన్స్కీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తీవ్ర గాయాలేమీ కాలేదు అని అధ్యక్షుడి ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ వెల్లడిరచారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఖర్కీవ్‌లోని ఇజియం నగరాన్ని జెలెన్స్కీ సందర్శించి తిరిగి వస్తుండగా కీవ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.













