పుతిన్ ఆరోగ్యంపై మరోసారి ఆందోళన
ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక మార్లు వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన ఆరోగ్యంపై వదంతులొచ్చాయి. పుతిన్ తాజా ఆరోగ్య నివేదికల ప్రకారం ఆయన విపరీతమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, తరచూ నాలుక తిమ్మిరిగా మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలపై వైద్యులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంతర్జాతీయ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పుతిన్ కుడి చేయి. కాలుకు స్వర్వ కోల్పోవడంతో ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. అయితే పుతిన్ విశ్రాంతి తీసుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం.













