ఆ దేశంపై రష్యా అణ్వాయుధం వాడొచ్చు : అమెరికా
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించవచ్చని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. వార్షిక మప్పు అంచనా నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యన్ల మద్దతు పొందేందుకు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలనూ ఆయన యుద్ధంలోకి లాగవచ్చని వారు భావిస్తున్నారు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని రష్యాను బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని, ఈ దేశ సైనిక విజయాలన్నీ అమెరికా, నాటో దేశాల జోక్యం కారణంగానే సాధ్యమవుతున్నాయని పుతిన్ గట్టిగా భావించడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోందని చెబుతున్నారు.













