ఆయన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే : పుతిన్
రష్యా-చైనా మధ్య మైత్రీ బంధం పెంచడంతో జిన్పింగ్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. జిన్పింగ్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ రెండు దేశాల మధ్య ఆ మైత్రీ బంధంతోనే ఇటీవల సహకారం పెరిగిందని వెల్లడించారు. రష్యా`చైనా ప్రజల కోసం ఈ నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మీ నాయకత్వం కింద చైనా స్థిరమైన ఆర్థికవృద్ధితో స్పూర్తిమంతమైన విజయాన్ని సాధించింది. ప్రజా సంక్షేమం పెరిగింది. అంతేకాదు ప్రపంచంలోనే బీజింగ్ పాత్ర బలోపేతమైంది అని పుతిన్ వ్యాఖ్యానించారు.













