వర్జీనియా వైద్యునికి 465 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని ఓ డాక్టర్‌కు భారీగా జైలు శిక్ష విధించారు. వర్జీనియాకు చెందిన డాక్టర్ జావేద్ పర్వేజ్ మందులతో తగ్గే రోగాలకు సైతం అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేసేవాడని, మందులతో తగ్గే అవకాశం ఉన్నా శస్త్రచికిత్స చేయాలని చెప్పేవాడని విచారణలో తేలింది. ఎక్కువగా గర్బసంచి సంబంధిత ఆపరేషన్లే చేసేవాడు. పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్ర చికిత్సలు చేసినట్లు గుర్తించారు. ఓ డాక్టర్ పదేళ్ల కాలంలో 7.63 శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేస్తారని అంచనా వేస్తే వర్జీనియా వైద్యుదు జావేద్ పర్వేజ్ మాత్రం 41.26 శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేసారు. డబ్బుకోసం ఆశపడి ఈ విధంగా వ్యవహరించినట్లు తేలింది. ఆపరేషన్ల పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు రాబట్టాడు. ఆ డాక్టర్‌పై 29 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో అతడి దురాశ నిజమేనని వెల్లడైంది.













