సెనెగల్ అభివృద్ధికి భారత్ సహకారం : ఉపరాష్ట్రపతి
సెనెగల్ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి భారత్ నిబద్ధతతో ఉన్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతి సెనెగల్ దేశాధ్యక్షుడు మాకీసాల్తో విసృతస్థాయిలో చర్చలు జరిపారు. ఈ మేరకు రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, రైల్వే, ఇంధన తదితర రంగాల్లో సహకారం మరింత పెంపొందించుకునేందుకు ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి. అంతకుముందు ఉపరాష్ట్రపతి డాకర్లో అట్లాంటిక్ తీరం వెంబడి ఉదయం వేళ నడక సాగించారు. సాయంత్రం తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి డాకర్‌లోని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఆఫ్రికన్ పునరుజ్జీవనోద్యమ స్మారక నిర్మాణాన్ని సందర్శించారు. బ్లాక్ సివిలైజేషన్ మ్యూజియంను, అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించారు.













