అమెరికాలో కలకలం
అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం వెలుపలి గేటును ఓ వ్యక్తి వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు యునైటెడ్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో లేరు. ఈ ఘటన జరిగినప్పుడు 15 స్ట్రీట్‌తో పాటు పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఇది ట్రాఫిక్ సమస్య కారణంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.













