భారత ప్రభుత్వానికి తక్షణమే సాయం : అమెరికా
భారత్లో కరోనావైరస్ రెండో దశ ఉద్ధృతి చూస్తే హృదయం విదారకంగా ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి తక్షణం అదనపు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ వెల్లడించారు. భారత్లో కరోనా కల్లోలం చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తోంది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వంలోని మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అంతేకాకుండా భారత ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి అదనపు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు. భారత్కు కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లు, ముడి సరుకులు, ప్రాణ రక్షక వైద్య సంబంధిత సరఫరాలను అందజేయాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది.













