ఆ దేశాన్ని గెలిపించడమే తమ లక్ష్యం : అమెరికా
రష్యాతో పోరులో ఉక్రెయిన్ గెలిచేలా చేస్తామని, ఆ దేశ యుద్ధ సామర్థ్యాలను పెంచుతామని అమెరికా తెలిపింది. అత్యాధునిక లెపర్డ్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో వైట్ హౌస్ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అందుకు నాటో దేశాలతో కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది. 14 లెపర్డ్ 2 ఏ6 ట్యాంకులను అందిస్తామని జర్మనీ ప్రకటించగానే అమెరికా కూడా తమ అత్యాధునిక అబ్రామ్స్ ట్యాంకులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. యుద్దక్షేత్రంలో విజయవంతం కావడానికి అవసరమైన సామర్థ్యాలను ఉక్రెయిన్‌కు అందేలా చేయడం మా మిత్రదేశాల లక్ష్యం అని అమెరికా జాతీయ భద్రతా సలహా మండలి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ సమన్వయకర్త జాన్‌కిర్బీ తెలిపారు.













