ఇండియాతో సహా అన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది : అమెరికా
కరోనా వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై అమెరికాకు సులభంగా రావొచ్చు. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని ఆమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియాతో సహా అన్ని దేశాల ప్రజలకు ఇది వర్తిస్తుంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే విమానం ఎక్కేముందు కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. వ్యాక్సిన్ తీసుకొని మైనర్లకు ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది.













