అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం …విద్యార్థులకు మరో ఏడాది పాటు
విద్యార్థులు, వృతి నిపుణులకు ఊరట కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా దరఖాస్తుదారులకు కొన్ని వలసేతర వీసా కేటగిరీల్లో ఇంటర్వ్యూ విషయంలో ఇస్తున్న మినహాయింపును పొడిగించింది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించేలా ఇప్పటికే ఓసారి నిర్ణయం తీసుకోగా ఇప్పుడు దాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా లేదా పునరుద్దరణ వీసా దరఖాస్తుల్లో ఎవరిని ఇంటర్వ్యూలకు పిలవాలనేది నిర్ణయించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకు అప్పగించినట్లు తేలిపింది. విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వర్కర్లు అమెరికాకు రావడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. . తాజా నిర్ణయం వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లే వృతినిపుణులు, విద్యార్థులకు మేలు జరగనుది.













