ఆఫ్ఘనిస్తాన్ కు షాక్.. యూఎస్ బలగాలు

సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యం పూర్తిగా వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన వేగంగా అమలవుతున్నది. ఉపసంహరణ పక్రియాలో భాగంగా ఇప్పటి వరకు 44 శాతం బలగాల ఉపసంహరణ పూర్తి చేసినట్లు సెంట్రల్ కమాండ్ (సెన్‍కామ్) తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్‍లో రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్దం ముగిసినట్లుగా ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి అమెరికా బలగాలతో పాటు నాటో దళాలు వెనక్కి తిరిగి వస్తున్నాయి. అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ నుంచి 300 సీ-17 కార్గో, 13,00 సైనిక పరికరాలను డిఫెన్స్ లాజిస్టిక్స్, ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు.
అమెరికా అధికారికంగా 6 సంస్థలను ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించింది. ఈ సమాచారాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. 2020 ఫిబ్రవరి 29న దోహాలో తాలిబాన్, యూఎస్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సైన్యం ఉపసంహరణ చేపడుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధంలో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‍లో శాంతి పునరుద్ధరించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‍లో ప్రస్తుతం 2,500 మంది అమెరికన్ సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు.