భారత్ కు 100 మిలియన్ డాలర్ల సాయం : అమెరికా

కరోనా వైరస్ ఉధృతితో వణికిపోతున్న భారత్‍కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేసింది. అత్యవసర సాయం కింద సుమారు 100 మిలియన్ డలర్ల (భారత కరెన్సీలో రూ.744 కోట్లు) విలువైన వైద్య పరికరాలు, మెడిసిన్స్ పంపిస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించింది. ఈ మేరకు వైట్‍హౌస్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అత్యవసరంగా 17 వందల ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు, 11 వందల ఆక్సిజన్ సిలిండర్లు, 20 మంది రోగులకు నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరా చేసే ఆక్సిజన్ యూనిట్లను పంపిస్తున్నట్లు వైట్‍హౌస్ పేర్కొంది.
కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి మంది భారతీయులకు 23 మిలియన్ల డాలర్ల మొత్తం ఇచ్చామని, వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 లక్షల ఎన్95 మాస్క్లు, 9.6 లక్షల ర్యాపిడ్ కిట్స్ పంపించినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. వీటితో పాటు తమ కోసం ఆర్డర్ చేసిన రెండు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకాలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‍డిసివిర్ వయల్స్ 20 వేల వరకు పంపిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా యూఎస్ ఎయిడ్ తరపున త్వరలో వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తాం అని శ్వేతసౌధం వెల్లడించింది.