పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా … నవంబర్ 8 నుంచి
భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికా వచ్చిన 60 రోజుల్లోపూ టీకా పొందాల్సి ఉందని తెలిపింది. ప్రయాణం ప్రారంభమైన 72 గంటల్లోపు చేయించుకొన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్టును అందించాలి. పలు దేశాలపై పరిమితుల తొలగింపు గురించి సెప్టెంబర్లోనే శ్వేతసౌధం ప్రకటించింది.













